గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ భూమి పూజ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. చాలా ఆనందకరమైన, చారిత్రక దినం ఈ రోజు…మాకు ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం కావాలనే కల ఏళ్లుగా ఉంది.. ఆ కల ఇప్పుడు సాకారం అయ్యిందన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉస్మానియా ఆస్పత్రి అంటేనే ఒక బ్రాండ్… కొత్త ఉస్మానియా ఆస్పత్రి బిల్డింగ్ కావాలనే కల ను నెరవేర్చేందుకు ఆరు నెలలుగా కృషి చేశామని తెలిపారు. 1919 నుంచి… అఫ్జల్గంజ్ ఆస్పత్రి నుంచి ఇప్పుడు ఒక కొత్త భవనానికి శ్రీకారం చుట్టామని వివరించారు. ప్రస్తుతం 22 ఎకరాల ఆస్పత్రి ఉంది..గోషామహల్ స్టేడియం లో 36 ఎకరాలు ఉంటుంది తెలిపారు. అందులో ఆరోగ్య శాఖ.. 26 ఎకరాలు తీసుకుని.. దాదాపుగా 40 డిపార్ట్మెంట్ లతో ఉస్మానియా కు 9 అనుబంధ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామన్నారు. మా లక్ష్యం ఉస్మానియాను పరిరక్షించడమేనన్నారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.