భార్యతో గొడవ.. తండ్రిని కాలువలోకి విసిరేసిన కొడుకు

-

వృద్ధాప్యంలో తల్లిదండ్రలకు ఆసరా నిలవాల్సిన తనయులు కాలయములుగా మారుతున్నారు. భార్యతో గొడవ పెట్టుకుని ఓ కొడుకు తండ్రిని ఏకంగా కెనాల్ కాలువలో విసిరేసి హత్య చేసిన ఘటన ఏపీలో సంచలనంగా మారింది. స్థానికుల కథనం ప్రకారం.. పల్నాడు జిల్లా నూజెండ్లకు చెందిన గంగినేని కొండయ్య తనకున్న రూ. 20 లక్షల ఆస్తిని అమ్మేసి పెద్దకొడుకు వెంకటేశ్వర్లు వద్దకు తన భార్య శాంతమ్మతో కలిసి వచ్చాడు.

ఇటీవల కొండయ్య భార్య మరణించింది. అప్పటి నుంచి కొండయ్య తన కొడుక్కి భారంగా మారాడు. తన భార్యతో గొడవ కారణంగా వెంకటేశ్వర్లు తన తండ్రిని అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే ఓ కారు మాట్లాడుకుని తన తండ్రిని అందులో ఎక్కించుకుని ఈపూరు వైపు వెళ్ళాడు.
భద్రుపాలెం వద్దకు వెళ్ళిన తర్వాత సాగర్ కాలువ కట్టపై కారును నిలిపి తన తండ్రి కొండయ్యను చేతులతో ఎత్తి కాలువలోకి విసిరేశాడు.ఇదంతా గమనించిన స్థానిక రైతులు వెంకటేశ్వర్లను పట్టుకున్నారు. అప్పటికే కాలువలో మునిగిపోయి కొండయ్య మృతి చెందాడు. కొడుకు వెంకటేశ్వర్లును స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news