రాజ్ భవన్ ఎదుట బైఠాయించిన సీఎం రేవంత్ రెడ్డి

-

అదానీ వ్యవహారం, మణిపూర్ అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలంటూ  బీజేపీ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఏఐసీసీ పిలుపు మేరకు  టీపీసీసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఛలో రాజ్ భవన్ ర్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,  పలువురు మంత్రులు,  ఎమ్మెల్యేలు, యువ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ కి ర్యాలీ గా వచ్చారు jకాంగ్రెస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ ఎదుట రోడ్డుపై భైఠాయించారు. సీఎం గా తొలిసారి కాంగ్రెస్ జెండా పట్టుకొని రేవంత్ రెడ్డి నిరసన వ్యక్తం చేయడం ఇదే మొదటి సారి కావడం విశేషం. మోడీ, అదానీ ఏక్ హై అంటూ నినాదాలు చేశారు. నెక్లెస్ రోడ్డు నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version