మైలార్‌దేవ్‌పల్లిలోని లక్ష్మిగూడలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఫుట్ పాత్ పై ఉన్న ఆక్రమణలు తొలగిస్తున్నారు అధికారులు. జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో లక్ష్మీగూడా నుంచి వాంబే కాలనీ వరకు కొనసాగుతున్నాయి కూల్చివేతలు. దీంతో భారీగా మోహరించారు పోలీసులు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇల్లు రోడ్డు మీదనే ఉంది కానీ వాళ్ళ ఇల్లు ఎవరు టచ్ చేయలేదని స్థానికులు ఆగ్రహించారు. రూల్స్ ప్రకారం కూల్చితే ఎమ్మెల్యే ఇల్లు కూడా కూల్చాలి కదా? అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే అనేవాడు ముందు ఉండి తనది కూల్చేసి అందరిది కూల్చాలి అంటే అందరం ముందుకు వస్తామన్నారు. కూల్చేస్తున్నారు అని ఎమ్మెల్యేకు చెప్పుకుంటే వచ్చి కూల్చొద్దు అని చెప్పి ఆటే వెళ్లిపోయాడు.. ఆయన వెళ్ళగానే వీళ్లు మళ్లీ వచ్చి కూల్చేశారని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇల్లు రోడ్డు మీదనే ఉంది కానీ వాళ్ళ ఇల్లు ఎవరు టచ్ చేయలేదు
రూల్స్ ప్రకారం కూల్చితే ఎమ్మెల్యే ఇల్లు కూడా కూల్చాలి కదా?
ఎమ్మెల్యే అనేవాడు ముందు ఉండి తనది కూల్చేసి అందరిది కూల్చాలి అంటే అందరం ముందుకు వస్తాము
కూల్చేస్తున్నారు అని ఎమ్మెల్యేకు… https://t.co/biXD6iJodg pic.twitter.com/feqAnxRDaD
— Telugu Scribe (@TeluguScribe) December 18, 2024