కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఛలో రాజ్ భవన్ ర్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, యువ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డు నుంచి రాజ్ భవన్ వరకు పాదయాత్ర కొనసాగుతోంది. అదానీ వ్యవహారం, మణిపూర్ అల్లర్లపై దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ నిరసనలు చేపడుతోంది. దేశంలో రాజ్యాంగినికి ముప్పు పొంచి ఉందని తెలిపారు. జమిలీ ఎన్నికలు దేశానికి చాలా ప్రమాదకరం అంటూ పేర్కొంటున్నారు కాంగ్రెస్ నేతలు. జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు.