ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి వెళ్లనున్నారు. రేపు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. ఈ సందర్భంగా అధిష్టాన పెద్దలతో సమావేశం కానున్నారట సీఎం రేవంత్ రెడ్డి. కేబినెట్ విస్తరణపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.
అయితే.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ తో మంత్రివర్గ విస్తరణపై ఇకనైనా సస్పెన్స్ కు తెరపడేనా? అని చర్చ జరుగుతోంది. కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి- సీనియర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదట. రేవంత్ సన్నిహితులకు పదవులు ఇచ్చేందుకు హైకమాండ్ నిరాకరణ తెలుపుతోందని అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే.. రేపు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు.