గ్రూప్ – 2 పరీక్ష వాయిదాకు హైకోర్టులో పిటిషన్

-

గ్రూప్ – 2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు నేడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 15, 16వ తేదీల్లో తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష జరగనుంది. ఇక డిసెంబర్ 16, 17 వ తేదీల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్ పరీక్ష ఉంది. ఒకేరోజు రెండు వేరువేరు పరీక్షలు ఉండడంతో గ్రూప్ 2ని వాయిదా వేయాలని నిరుద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు.

ఇదే విషయంపై అభ్యర్థులు ఇప్పటికే టీజీపీఎస్సీ చైర్మన్ కి వినతి పత్రాన్ని సమర్పించారు. అయినా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తూ ఉండడంతో పరీక్ష వాయిదాకు పోరుబాట పట్టాలని నిర్ణయించిన అభ్యర్థులు.. సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ని కోర్టు విచారణకు స్వీకరించింది.

నిరుద్యోగుల పిటిషన్ ని జస్టిస్ కార్తిక్ విచారించనున్నారు. గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం మొండికి పోయి తమకు అన్యాయం చేయవద్దని, గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని కోరినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విధి లేని పరిస్థితులలో తాము హైకోర్టును ఆశ్రయించామని అంటున్నారు నిరుద్యోగులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version