ఇవాళ మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలు దేరనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం ఇండియా టుడే కాంక్లేవ్ ప్రోగ్రామ్ లో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కే.సి.వేణుగోపాల్ ను కలవనున్నారు రేవంత్ రెడ్డి. ఇక సీఎం రేవంత్ రెడ్డితో ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహోశ్ కుమార్ గౌడ్ కూడా వెళ్లనున్నారు.
ఇక అటు నేడు BRS ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ని ఫైనల్ చేయనున్నారు కేసీఆర్. ఇందులో భాగంగానే…. నేడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో BRS ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ నెల పదవ తేదీ వరకు నామినేషన్ లకు గడువు ఉండనుంది. పార్టీ ఎమ్మెల్యే ల సంఖ్యాబలం ప్రకారం brs కు ఒక్క ఎమ్మెల్సీ కచ్చితంగా రానుంది. ఈ తరుణంలోనే… నేడు BRS ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ని ఫైనల్ చేయనున్నారు కేసీఆర్.