కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి దిమ్మతిరిగే షాక్ ?

-

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి… సొంత నియోజకవర్గ జగిత్యాల లోనే ప్రాధాన్యత లేకుండా పోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు కింగులా బతికారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అయితే ఎప్పుడైతే… గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్లోకి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరారో.. అప్పటినుంచి… అసలు జీవన్ రెడ్డికి ప్రాధాన్యత లేకుండా పోతోంది. రేవంత్ రెడ్డి కూడా జీవన్ రెడ్డిని పట్టించుకోవడంలేదని సమాచారం.

cm revanth on jeevan reddy

అయితే తాజాగా మరో సంఘటన లో కూడా… కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జగిత్యాల నియోజకవర్గం లో.. వ్యవసాయ మార్కెట్ కమిటీలలో తన అనుచరులను సభ్యులుగా చేర్చాలని.. సీఎం రేవంత్ రెడ్డి ని జీవన్ రెడ్డి కోరినట్లు సమాచారం. అయితే దీని రేవంత్ రెడ్డి వ్యతిరేకించారట. గులాబీ పార్టీ నుంచి వచ్చిన సంజయ్ కుమార్ తనకు ముఖ్యమని… రేవంత్ రెడ్డి అన్నారట. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏం చేయలేని పరిస్థితి నెలకొంది అని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version