ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇంటి ముందు తెలంగాణకు చెందిన ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఆందోళన చేస్తున్నారు. తెలంగాణలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణలో వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న స్వంతంత్ర జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. రైతు రుణమాఫీ, రైతుబంధు గురించి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయన్నారు.
రాహుల్ గాంధీ తెలంగాణ వచ్చి వీధుల్లో ప్రేమను పంచుతా అన్నారు.. కానీ పరిస్థితులు అలా లేవు… రాహుల్ గాంధీని కలిసి విజ్ఞాపన పత్రం ఇద్దామని వచ్చామని చెప్పారు. అనుమతించకపోవడంతో రాహుల్ ఇంటి ముందు జర్నలిస్టుల సమస్యలపై నిరసన తెలుపుతున్నాం… ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వతంత్ర జర్నలిస్టులు పనిచేయడం లేదు.. అలా చేస్తే మాపై కేసులు పెట్టుకోవచ్చు అన్నారు. ప్రజా సమస్యలు, వాస్తవాలను వెలుగులోకి తెస్తున్నందుకు దాడులు చేయడం సరికాదు.. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే దాడులు చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ అధిష్టానానికి పరిస్థితి తెలిపేందుకు ఢిల్లీకి వచ్చామన్నారు.