రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అధికార బాద్యతలు చేపట్టిన రెండు నెలల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉనుముల రేవంత్ రెడ్డి తొలిసారి సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గత రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం రాత్రి ముగించుకొని హైదరాబాద్ కి వచ్చారు. ఇవాళ కొడంగల్‌లో పర్యటిచనుట్లు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అందుకోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. వేల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తుండడంతో కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక సిద్దమైంది.
ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటనలో భాగంగా నేడు కోస్గిలో రూ.4,369 కోట్ల విలువైన 20 అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో ప్రధానంగా నారాయణపేట-కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని రూ.2,945 కోట్లతో ప్రభుత్వం నిర్మించనుంది. అనంతరం ఇవాళ సాయంత్రం కోడంగల్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.