రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

-

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏళ్లకేళ్లుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, పాత్రికేయులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.

‘ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం.. పదేళ్లు పూర్తి చేసుకుని, 11వ సంవత్సరంలో అడుగుపెడుతోంది. ఈ ఏడాది జూన్‌ 2వ తేదీకి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ రోజుతో తెలంగాణ స్వరాష్ట్రానికి సంపూర్ణ విముక్తి లభించింది.  తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది’ అని సీఎం రేవంత్‌ అన్నారు. తెలంగాణ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, ప్రజా పాలనను అందిస్తామని తెలిపారు. విభజన చట్టం ప్రకారం ఇంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ ఇకపై తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుందని.. ఇకపై విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో  సింహభాగం తెలంగాణ రాష్ట్ర ప్రజలకే దక్కుతాయని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version