లష్కర్ బోనాల ఉత్సవం.. మహంకాళీ అమ్మవారి సేవలో సీఎం రేవంత్

-

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి బోనాల ఉత్సవం రంగరంగ వైభవంగా జరుగుతోంది. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనం సమర్పించేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. మరోవైపు మహంకాళి ఆలయాన్ని పలువురు ప్రముఖులు సందర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, దానం నాగేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మహంకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో బోనాల పడుగ ప్రత్యేకత సంచరిచుకుందని అన్నారు. ఒక్కప్పుడు హైదరాబాద్ లో ప్రజలు కలరా లాంటి వ్యాధులతో ఇబ్బంది పడుతుండేదని.. అప్పుడు ఉజ్జయిని అమ్మవారిని పూజించి బోనాల నిర్వహించడంతో అలాంటి వ్యాధుల నుంతి విముక్తి లభించిందని తెలిపారు. అప్పటి నుంతి ఈ బోనాల పండుగను ప్రతి ఏటా జరుపుకుంటున్నామని వెల్లడించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఎంతో విశిష్టత కలిగిన అమ్మవారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version