ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపులు వేగవంతం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు, నిధులకు సంబంధించి సీఎం అధికారులతో చర్చించారు. ప్రతి నెల ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు విధిగా విడుదల చేయాలని అన్నారు. ప్రయివేటు ఆసుపత్రుల ఆరోగ్యశ్రీ బిల్లులను ప్రతీ మూడు నెలలకోసారి విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులకు ఆదేశించారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా వున్న టీచింగ్ హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్ కు పెండింగ్ లో ఉన్న రూ.270 కోట్ల ఆరోగ్య శ్రీ బిల్లులు వెంటనే విడుదల చేయాలని చెప్పారు. అలాగే జూనియర్ డాక్టర్స్, ఆశ వర్కర్స్, స్టాఫ్ నర్సుల జీతాలు ప్రతి నెల క్రమం తప్పకుండ అందించేలా చూడాలన్నారు. 108,102 సేవల పనితీరును ముఖ్యమంత్రి అరా తీశారు, మెరుగైన సేవలు అందించేలా చూడాలని సీఎం ఆదేశించారు.