ఇవాళ హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌ నూతన ప్రాంగణానికి శంకుస్థాపన

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా పలు కంపెనీలతో సమావేశమై పెట్టుబడులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కాగ్నిజెంట్ సంస్థ రాష్ట్రంలో మరో క్యాంపస్ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఇవాళ ఆ క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది.

ఐటీ కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఏర్పాటు చేస్తోన్న ఈ క్యాంపస్‌కు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్లో 10 లక్షల చదరపు అడుగుల కొత్త క్యాంపస్ నెలకొల్పనున్నారు. ఈ క్యాంపస్ ద్వారా అదనంగా 15 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ఈ కంపెనీకి ఐదు క్యాంపస్‌లు ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో దాదాపు 57 వేల మంది ఉద్యోగులున్నారు. ఇప్పుడు ఆరో క్యాంపస్ ఏర్పాటు చేస్తుండటంతో అదనంగా మరికొంత మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డిజిటల్‌ ఇంజినీరింగ్‌, క్లౌడ్‌ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ పనిచేయనున్నట్లు కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version