తెలంగాణలోని ఉమ్మడి జిల్లాకో స్కిల్ యూనివర్సిటీ

-

తెలంగాణ రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ప్రారిశ్రామిక అవసరాలకు కావాల్సిన నైపుణ్యంగల ఉద్యోగాలను సాధించే విధంగా ఈ స్కిల్ యూనివర్సిటీలుండాలని అన్నారు. వీటిలో ఉపాధి ఆధారిత స్వల్పకాల, దీర్ఘ కాల కోర్సులను ప్రవేశ పెట్టాలని పేర్కొన్నారు.

ఈ విషయంలో గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఒరిస్సా, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్న ఈ విధమైన స్కిల్ యూనివర్సిటీలని అధ్యయనం చేయాలన్నారు. కొడంగల్ నియోజక వర్గంతోపాటు తొమ్మిది జిలాల్లో ఈ స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఇందుకుగాను, విద్యా శాఖ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీ వేసి తగు ప్రతిపాదనలను సమర్పించాలని సీఎస్ ను ఆదేశించారు. తెలంగాణలోని పంచాయతీల్లో బడి ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి స్పష్ఠం చేశారు. బడి లేని పంచాయతీ తెలంగాణలో ఉండొద్దని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version