కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ.. క్లారిటీ ఇచ్చిన విజయశాంతి

-

తెలంగాణలో ఇప్పటి నుంచే రాజకీయ వేడి రగులుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి రాజకీయాలు హీటెక్కాయి. ప్రతిపక్ష పార్టీలన్నింటికి షాక్ ఇస్తూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాలో కేసీఆర్ పేరు రెండు సార్లు కనిపించడంతో రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేసింది. గజ్వెల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా కేసీఆర్ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు గజ్వెల్ స్ట్రాంగ్ అభ్యర్థిని బరిలోకి దింపాలనుకున్న బీజేపీ, కాంగ్రెస్ కామారెడ్డిలో అలాగే చేయాల్సి వచ్చింది.

సీఎం కేసీఆర్ కి పోటీగా కామారెడ్డిలో విజయశాంతిని బీజేపీబరిలోకి దించేందుకు సిద్ధమైందంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై స్పందించారు విజయశాంతి. కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పై ఎవరు పోటీ చేస్తారనేది బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. బీజేపీ నుంచి ఎవ్వరూ బరిలోకి దిగినా గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. కామారెడ్డిలో పోటీ చేసేది నేనా లేక ఇంకా ఎవరైనా అనేది త్వరలోనే తేలిపోతుందని చెప్పారు విజయశాంతి. గత రెండు రోజులుగా కామారెడ్డి కేసీఆర్ పై పోటీ చేస్తుందని పలు మీడియాలో.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. గజ్వెల్, కామారెడ్డి రెండు చోట్ల కేసీఆర్ ని ఓడించడం తెలంగాణ ఉద్యమకారుల బాధ్యత అని పేర్కొన్నారు విజయశాంతి. 

Read more RELATED
Recommended to you

Latest news