మీనాక్షి నటరాజన్ కు కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేల లేఖ రాశారు. మాదిగలకు కేబినెట్ లో అవకాశం కల్పించాలని కోరారు దళిత ఎమ్మెల్యేలు. మంత్రి ఉత్తమ్ ను కలిసి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మందుల సామేలు, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలే యాదయ్య లేఖ అందజేసారు.

ఉండగా ఏప్రిల్ 3న తెలంగాణ కేబినెట్ విస్తరణ జరుగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు రెడ్లు, ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీకి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే సంబంధిత నేతలకు సంకేతాలు కూడా పంపినట్లు తెలుస్తోంది. వారిలో రాజగోపాల్, సుదర్శన్, వివేక్ పేర్లు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది.