నేడు కేసీఆర్‌ బర్త్‌ డే..పోస్టర్లు తొలగిస్తున్న అధికారులు !

-

నేడు తెలంగాణ మొదటి సీఎం, బీఆర్‌ఎస్‌ పార్టీ చీఫ్‌ కేసీఆర్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. దీంతో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా… కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. మొక్కలు నాటడం… ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు. అయితే.. ఈ తరుణంలోనే… బీఆర్‌ఎస్‌ పార్టీ చీఫ్‌ కేసీఆర్ , బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలకు షాక్‌ తగిలింది.

Congress government cancels flexi organized to celebrate BRS chief KCR’s birthday

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్‌ నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, జెండాలను తీసేయాలని ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసిందట ప్రభుత్వం. అయితే.. బీఆర్‌ఎస్‌ పార్టీ చీఫ్‌ కేసీఆర్ ఫ్లెక్సీలను చింపుతున్న అధికారులను నిలదీస్తున్నారు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news