కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 48 గంటల కరెంటు ఇస్తామని మైనంపల్లి కొడుకు రోహిత్ రావు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు విచిత్రమైన హామీలు ప్రకటించారు. ‘తెలంగాణలో ఇప్పుడు ఎలాగైతే 24 గంటల కరెంటు వస్తుందో… చేతి గుర్తు ప్రభుత్వం వచ్చాక అవసరమైతే రోజుకు 48 గంటలు కరెంటు ఇస్తాం.
అట్లాంటి వాళ్ళం మేము. నిజంగా అవకాశం ఉంటే రోజుకు 25 గంటల కరెంటు ఇస్తాం’ అని ప్రకటించారు. అయితే రోహిత్ రావు చేసిన వ్యాఖ్యలపై ట్రోలింగ్ నడుస్తోంది. అటు తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ రైతులకు మూడు గంటల కరెంటు సరిపోతుందంటూ బాంబు పేల్చారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 95% మాత్రమే చిన్న సన్నకారు రైతులు ఉన్నారని… వారందరికీ మూడు గంటల కరెంటు సరిపోతుందని పేర్కొన్నారు. ఒక్క గంటకు ఒక ఎకరం నీళ్లు పారుతాయని.. మూడెకరాలు ఉన్న మూడు గంటల్లో ఆ రైతు తన భూమికి నీళ్లు పెట్టుకోవచ్చని రేవంత్ రెడ్డి తెలిపారు.