వరల్డ్ కప్ 2023 లో దారుణంగా శ్రీలంక విఫలం ఐన సంగతి తెలిసిందే. ఈ తరుణ0 లో శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. శ్రీలంక క్రికెట్ సభ్యత్వాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రద్దు చేసింది. శ్రీలంక క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐసీసీ సభ్యదేశంగా శ్రీలంక తన బాధ్యతలను ఉల్లంఘించిందని పేర్కొంది.
నవంబర్ 21న జరగనున్న ఐసీసీ సమావేశంలో శ్రీలంక క్రికెట్ బోర్డుకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకొనున్నారు. గత నాలుగేళ్లలో ఐసీసీ సస్పెన్షన్ కు గురైన రెండో దేశంగా శ్రీలంక నిలిచింది. శ్రీలంక సస్పెండ్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసిసి వెల్లడించింది.
సస్పెన్షన్ షరతులను ఐసీసీ బోర్డు తగిన సమయంలో నిర్ణయిస్తుందని తెలిపింది. 2019లో జింబాబ్వే క్రికెట్ బోర్డుపై ఐసీసీ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ జోక్యంతో జింబాబ్వే క్రికెట్ బోర్డు కూడా సస్పెన్షన్ కు గురైంది. క్రికెట్ బోర్డులో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం కూడా శ్రీలంక క్రికెట్ బోర్డుకు శాపంగా మారింది.