రాష్ట్రంలో ఎరువుల కొరత కేవలం కాంగ్రెస్ నాయకుల ప్రమేయం తో బ్లాక్ మార్కెట్ కు పోయిందని అందుకే రాష్ట్రం లో రైతులు యూరియా కొరత తో తీవ్ర ఇబ్బందులకు గురైవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు విమర్శించారు. ఆదివారం గద్వాల పట్టణం లోని ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ తో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం లోనే ఎక్కువ మంది రైతులు మృత్యువాత పడ్డారని ఆయన ఆరోపించారు.
రైతులకు కావాల్సిన ఎరువులను కృత్రిమంగా కొరత సృష్టించి రాష్ట్రం లోని రైతులను నడిరోడ్డు పై నిల్చునేటట్టు చేసారని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన
ఎరువులు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల కు పైగా అవసరం కాగా కేంద్ర ప్రభుత్వం అదనంగా 12
లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందించిందని దీనికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వర్ రావు చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు కావాలనే
ఎరువులను బ్లాక్ మార్కెట్ కు మరియు ఇతర అవసరాల కోసం యూరియా ను తరలించారని పేర్కొన్నారు.