కాంగ్రెస్ మూడో జాబితా విడుదల కావడంతో పలు నియోజకవర్గాల్లో అసంతృప్తులు భగ్గుమన్నాయి. ఈ తరుణంలోనే రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి కాటా శ్రీనివాస్ అనుచరులు ప్రయత్నించారు. ఈ తరుణంలోనే కాటా శ్రీనివాస్‌గౌడ్ అనుచరులను అరెస్ట్ చేశారు పోలీసులు. అంతేకాదు.. రేవంత్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
అంతుకు ముందు పటాన్‌చెరు టికెట్ కాటా శ్రీనివాస్ గౌడ్‌కి కేటాయించకపోవడంతో రోడ్డుపై హంగామా సృష్టించిన కాటా శ్రీనివాస్ గౌడ్ అభిమానులు.. రేవంత్ రెడ్డి మరియు జగ్గారెడ్డి దిష్టిబొమ్మ దగ్దం చేశారు. కాగా.. బోథ్, వనపర్తిలో అభ్యర్థుల్ని మార్చడంతో వారి మద్దతుదారులు నిరసనలకు దిగారు. అటు నర్సాపూర్ అభ్యర్థిని మార్చాలంటూ శ్రేణులు ఆందోళన చేపట్టారు. కాగా, ఇప్పటికే చెన్నూరు, తుంగతుర్తి టికెట్లు దక్కకపోవడంతో మాజీ మంత్రి బోడ జనార్ధన్, గుడిపాటి నరసయ్య పార్టీకి రాజీనామా చేశారు.