ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముందే తెలుసు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
మార్నింగ్ న్యూస్ లో మాట్లాడుతూ… కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న నరేందర్ రెడ్డి గెలవడం చాలా కష్టమన్నారు. అయినా కూడా అతన్ని గెలిపించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లారని గుర్తు చేశారు. ఎన్ని చేసినా అక్కడ నరేందర్ రెడ్డి గెలవడం కష్టమేనని తెలిపారు. నరేందర్ రెడ్డి ఓడిపోయిన కూడా తనకు ఇలాంటి సమస్య లేదని…. ప్రభుత్వం కూడా పడిపోదని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీన్మార్ మల్లన్న సమర్థించారు. అక్కడ కాంగ్రెస్ ఓడిపోవడం గ్యారంటీ అని పరోక్షంగా చెప్పుకొచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలుసు: కాంగ్రెస్ ఎమ్మెల్సీ pic.twitter.com/XlA6A7p3V9
— Gowtham Pothagoni (@Gowtham_Goud6) February 25, 2025