మహాకుంభమేళాకు వెళ్లే వారికి బిగ్ అలర్ట్. నేటితో మహాకుంభమేళా ముగియనుంది. యూపీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా నేటితో అంటే బుధవారం తో ముగియనుంది. మహా శివరాత్రి పర్వదినంతో ఈ మహత్తర కార్యక్రమానికి తెరపడనుంది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. ఇప్పటివరకు 65 కోట్ల మంది స్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చివరి రోజైన ఇవాళ రెండు కోట్ల మంది రానున్నట్లు అంచనా వేస్తున్నాయి.
ఇక అటు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక కుంభమేళా. కోట్లాది మంది త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. అయితే, సంగమంలో పవిత్ర స్నానం చేయలేకపోయామని బాధపడుతున్న వారికి పలు ఆన్‌లైన్ మార్కెటింగ్ కంపెనీలు పుణ్య జలాలను అందించేందుకు రెడీ అయ్యాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్, జెప్టో, బ్లింకిట్‌లో ఆర్డర్ పెడితే కుంభమేళా పుణ్య జలాలు మీ ఇంటికి వచ్చేస్తాయి. మరి ఎందుకు ఆలస్యం.. ఆర్డర్ పెడితే వెంటనే ఇంటికి కుంభమేళా పుణ్య జలాలు రావొచ్చు.