తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆ గ్యారెంటీలను రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో విడుదల చేసి ప్రజలకు వివరించింది. ఇక తాజాగా ఆ ఆరు గ్యారెంటీలు అంతకంటే ఎక్కువ ప్రభావితం చేసేవిగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో మాదిరి తెలంగాణాలో కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజక వర్గాలకు పార్టీ అధిష్ఠానం నియమించిన పరిశీలకుల ద్వారా ఈ ఆరు హామీల గ్యారెంటీ కార్డును జనంలోకి తీసుకెళ్లేందుకు కసరత్తు చేస్తోంది. కరపత్రాలు, గోడ పత్రికలు, ఫ్లెక్సీలు, గోడ రాతలు ఇలా వివిధ రకాలుగా వాటిని గ్రామీణ ప్రాంతాలల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్దం చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అమలు చేయనున్న 6 హామీలు ఇవే..
- రైతుభరోసా పథకం
- మహాలక్ష్మి పథకం
- చేయూత పథకం
- యువవికాసం పథకం
- గృహజ్యోతి పథకం
- ఇందిరమ్మ ఇల్లు పథకం