ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కే టీజేఎస్ మద్దతు

-

నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్లు టీజేఎస్ స్పష్టం చేసింది. ఈ నెల 27న జరగనున్న వరంగల్ నల్గొండ ఖమ్మం శాసన మండలి ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ జన సమితి పార్టీకి లేఖ రాసిన నేపథ్యంలో టీజేఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ విద్వంసం సృష్టించిందన్నారు.

ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి చావు దెబ్బ తిని, తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ తన అక్రమాల నుంచి కాపాడు కోవడానికి ఈ ఎన్నికలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. ఎప్పటి కప్పుడు తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కుతూ పదేళ్ల పాలనలో ఏ ఒక్క విభజన హామీనీ నెరవేర్చనీ బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ను ఓడించెందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version