Telangana: ఇవాళ 8 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్న కాంగ్రెస్

-

నేడు తెలంగాణలో మిగిలిన 8 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు 9 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్.. 8 స్థానాల్లో అభ్యర్థులను పెండింగ్ లో పెట్టింది. ఆదిలాబాద్, ఖమ్మం, భువనగిరి, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించలేదు కాంగ్రెస్ పార్టీ. ఆదిలాబాద్ సీటుకు ఆత్రం సుగుణ పేరు పరిశీలన చేస్తున్నారు.

ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు సుగుణ. ఖమ్మంలో తమ వారికి సీటు ఇప్పించుకునేందుకు సీనియర్ నేతల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. భునగిరిలో కోమటిరెడ్డి బ్రదర్స్, రేవంత్ సన్నిహితుల మధ్య పోటీ ఉంది. చామల కిరణ్ కోసం పట్టుబడుతున్నారు రేవంత్. ఇక నేడు తెలంగాణలో మిగిలిన 8 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది కాంగ్రెస్ పార్టీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version