బీజేపీ 400 ఎంపీ సీట్లు గెలిస్తే రాజ్యాంగం రద్దు.. RSP సంచలన వ్యాఖ్యలు

-

‘మీరు గేట్లు తెరిస్తే అక్కడికి గొర్రెలు వచ్చినయని.. అదే బీఆర్ఎస్ పార్టీ గేట్లు తెరిస్తే ఇక్కడికి సింహాలు వచ్చాయి’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో శనివారం పలువురు బీఎస్పీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎంపీ కేకే పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ మాట్లాడుతూ.. నిజమైన తెలంగాణ ఇక్కడ ఉంటే.. తెలంగాణను మోసం చేసిన వాళ్లు అక్కడ ఉన్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్న వాళ్లందరూ అక్కడికి గేట్లు తోసుకుని పోతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన ఉద్యమం చారిత్రాత్మకమన్నారు. కేసీఆర్ పాలన స్వర్ణయుగమని వ్యాఖ్యానించారు.

చితికిపోయిన తెలంగాణకు కేసీఆర్ విముక్తి కల్పించారన్నారు. రాజ్యాంగ వ్యవస్థలైన ఈడీ, సీబీఐ అన్నింటినీ మోదీ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారన్నారు. రాజ్యాంగం రద్దయితే మనకు రిజర్వేషన్లు ఉండవని.. దళిత బిడ్డల బతుకు ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version