స‌న్ డే – ఫ‌న్ డే పై క‌రోనా ఎఫెక్ట్.. ఇక బంద్

-

హైద‌రాబాద్ లో ని ట్యాంక్ బండ్, నెక్ల‌స్ రోడ్డు పై ప్ర‌తి ఆదివారం నిర్విహించే స‌న్ డే – ఫ‌న్ డే పై క‌రోనా ప్ర‌భావం ప‌డింది. క‌రోనా తో పాటు ఓమిక్రాన్ ఎఫెక్ట్ ప‌డింది. క‌రోనా కేసులు పెర‌గడం.. ప‌క్క రాష్ట్రా ల‌లో ఓమిక్రాన్ వ్యాప్తి నేప‌థ్యం లో ఇక నుంచి సన్ డే – ఫ‌న్ డే నిలిపి వేస్తున్న‌ట్టు రాష్ట్ర పుర‌పాల‌క శాఖ ప్ర‌క‌టించింది. ఓమిక్రాన్ నేప‌థ్యం లో ప్ర‌జ‌లు గుంపులు గుంపు లు గా ఉండ‌టం స‌రి అయింది కాద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అలాగే పాత బ‌స్తీ లో గల చార్మీనార్ వ‌ద్ద జ‌రిగే ఏక్ శామ్ చార్మినార్ కే నామ్ అనే కార్యక్ర‌మాన్ని కూడా నిలిపి వేస్తున్న‌ట్టు రాష్ట్ర పురపాల‌క శాఖ తెలిపింది. త‌దుపరి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు ఈ రెండు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హనలో ఉండ‌వు అని తెల్చి చెప్పింది. కాగ ప్ర‌తి ఆది వారం ఈ రెండు కార్య‌క్ర‌మాలు సాయంత్రం 5 గంట‌ల నుంచి అర్థ‌రాత్రి వ‌ర‌కు నిర్వ‌హించే వారు.

Read more RELATED
Recommended to you

Latest news