రాష్ట్రంలో కరోనా వైరస్ ఉగ్రరూపాన్ని చూపిస్తుంది. రోజు రోజుకు భారీ సంఖ్యలో కేసులు నమోదు అవుతు రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటలలో 2,295 కేసుల నమోదు అయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులిటిన్ ద్వారా తెలిపింది. అయితే ఈ కేసులలో 1,452 కేసులు కేవలం జీహెచ్ఎంసీ లోనే నమోదు అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కాటుకు ముగ్గురు మృతి చెందారని అధికారులు తెలిపారు.
అలాగే గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 278 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో 9,861 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయి తెలంగాణ రాష్ట్రంలో కరోనా విస్ఫోటనం చూస్తేంటే అధికారులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాష్ట్రంలో కరోనా కేసులు 1,913 కేసులు నమోదు అయ్యాయి. అయితే నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు దాదాపు 400 కరోనా కేసులు ఎక్కువగా వచ్చాయి. అయితే ఇటీవల వచ్చిన క్రిస్మస్, న్యూయర్ వేడుకల ప్రభావం రాష్ట్రం పై భాగానే పడినట్టు తెలుస్తుంది. వీటి ప్రభావంతో నే కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయని అధికారలు భావిస్తున్నారు.