ఉత్కంఠగా కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్

-

నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ గా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేసి జనగామ నుంచి ఎమ్మెల్యే విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడటంతో మే 27న ఉప ఎన్నిక జరిగింది. నిన్నటి నుంచి కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. మార్చి 2021లో పల్లా రాజేశ్వర్ రెడ్డి 2వ స్థానం ఓట్లతో విజయం సాధించారు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డి మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొంది.

బీజేపీ నుంచి గతంలో పోటీ చేసిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మరోసారి బరిలో ఉన్నప్పటికీ మూడోస్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటికే తొలి రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. మొదటి రౌండ్లో 7,670 ఓట్ల ఆధిక్యత కనబర్చిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. ఇప్పటివరకు తీన్మార్ మల్లన్న 18 వేలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  మరికాసేపట్లో ఎలిమినేషన్ ప్రక్రియ అయిన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందులో దాదాపు ఎవరు గెలవబోతున్నారో ఓ క్లారిటీ రానుంది. ముఖ్యంగా చెల్లని ఓట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. కొంత మంది ఐలవ్ యూ, తీన్మార్ మల్లన్న విజయం పక్కా అంటూ బ్యాలెట్ పేపర్ రాయడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version