నకిరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను శనివారం ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సూర్యాపేట – పాలకీడు, దామరచర్ల మండలం మధ్యలో నిర్మించనున్న అదానీ గ్రూప్‌కి చెందిన పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీపై ప్రజా అభిప్రాయం సేకరణకు మాజీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ క్రమంలోనే ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తున్నారని తెలుసుకుని పోలీసులు ముందస్తుగా ఆయన ఇంటికి చేరుకున్నారు. కార్యక్రమానికి వెళ్లకుండా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తిని అతని ఇంట్లోనే నార్కెట్‌పల్లి పోలీసులు నిర్భంధించారు. కేవలం మాజీ ఎమ్మెల్యేనే కాకుండా నకిరేకల్ మాజీ నేతలు, గులాబీ కేడర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాల్సి ఉంది. కాగా, అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి వెతికేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలుచోట్లు రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.