ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలంలోని ఏదులాపురం కొత్త మున్సిపాలిటీ కేంద్రంగా అవతరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా జీవో (గెజిట్ నోట్) విడుదల చేసింది.దీంతో జిల్లా కలెక్టర్ ముజమ్మిలా ఖాన్ 12 గ్రామపంచాయతీలతో కూడిన మ్యాప్ డ్రాఫ్టును తయారు చేశారు. అనంతరం ఫైనల్ అప్రూవల్ కోసం ప్రభుత్వానికి పంపారు.
12 పంచాయతీలతో కొత్త మున్సిపాలిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఖమ్మం రూరల్ మండలంలోని పెద్దతండా, ఏదులాపురం, గుర్రం పాడు, వెంకటగిరి, గుదిమళ్ల, పోలేపల్లి, మద్దులపల్లి, బారుగూడెం, గొల్లగూడెం, ముత్తగూడెం, మద్దులపల్లి, తెల్టారుపల్లి, రెడ్డిపల్లిలో పాటు పంచాయతీలను కలిపి నూతన మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. కాగా, 2011 జనాభా లెక్కల ప్రకారం 12 పంచాయతీల్లో మొత్తం 56,647 జనాభా ఉన్నట్లు తెలుస్తోంది.