చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నామని…CPI తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని ప్రకటించారు. మేము ఎవరివెంట పడటం లేదని.. సీఎం కేసీఆర్ మా వెంట పడ్డాడని ఆగ్రహించారు. కాంగ్రెస్ తో పొత్తుపై అభ్యంతరం లేదని.. కాంగ్రెస్ వాల్లే వచ్చారు, వస్తున్నారు…సీపీఐ, సీపీఎం కలిసే ఉంటామని ప్రకటన చేశారు. మునుగొడులో BRS వాల్లే వచ్చారు,ఇపుడు కాంగ్రెస్ కూడా మా దగ్గరకు వస్తున్నారని.. గవర్నర్ పై పోరాటం చేస్తే brs ను వెనుకేసుకోచినట్లు కాదని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ పై కూడా పోరాటం చేస్తామని.. మా విధానం లో మార్పు లేదని వెల్లడించారు CPI తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని. కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నాయి ప్రభుత్వాలు…ఈ ఎలక్షన్ అయ్యాక మా మీద కూడా అక్రమ కేసులు పెడతారని మండిపడ్డారు. సీపీఐ, సీపీఎం ఇద్దరం పోటీలో ఉంటామని.. త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు CPI తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని. చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నామని.. అణచివేత మంచిది కాదని చెప్పారు. బీజేపీ వాళ్ళు సెలెక్టీవ్ గా ఎందుకు జైళ్లకు పంపుతున్నారు….మరి కవితను ఎందుకు పంపలేదని నిలదీశారు CPI తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని.