ఆనాడు కేసీఆర్ దీక్ష ఓ బూటకం.. సీపీఐ నేత నారాయణ సంచలన కామెంట్స్

-

తెలంగాణ సాధికారత తన వల్లే సాధ్యమైందంటూ డప్పుకొట్టి మరీ చెప్పుకుంటున్న కేసీఆర్.. అప్పట్లో దీక్ష ప్రారంభించి విరమించేందుకు ప్రయత్నించాడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అయితే ఉస్మానియా విద్యార్థులు ఆందోళనకు దిగడంతో అనివార్యంగా రూట్​ మార్చాడని ఆరోపించారు. అందుకే అప్పటి నుంచి ఉస్మానియాకు వెళ్లే ధైర్యం చేయలేదని తెలిపారు. ఉద్యమం నీరు గారొద్దని అప్పట్లో ఈ విషయాలను బయటకు రానీయలేదని.. కానీ తెలంగాణ కోసం తాను చావునోట్లో తలపెట్టానని కేసీఆర్‌ పదేపదే చెప్పడం చూడలేకే ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందని వెల్లడించారు. తాను ఆనాడు దీనికి ప్రత్యక్ష సాక్షినని చెప్పారు.

“1200 మంది యువత బలిదానాలతో మాత్రమే తెలంగాణ వచ్చింది. కానీ అది తానొక్కడి సాధనే అంటూ ప్రజలను మోసగిస్తున్నాడు. 30 సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ, 40 సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ చెప్పడం వెనుక వీరి చీకటి కలయిక దాగుంది. రాష్ట్ర అధ్యక్షునిగా ఒక బీసీని తొలగించిన బీజేపీ రాష్ట్రానికి బీసీ సీఎంని చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదం. పోలింగ్‌కు ముందు ‘రైతుబంధు’కు ఎన్నికల కమిషన్‌ అనుమతినివ్వడం బీఆర్ఎస్, బీజేపీతో కుమ్మక్కైన విషయాన్ని తెలియజేస్తోంది. ప్రజాఉద్యమంలో శ్రమిస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్న తమ పార్టీ అభ్యర్థి కూనంనేని సాంబశివరావును గెలిపించాలని ప్రజలను కోరుతున్నాను.” అని నారాయణ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version