తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ లో పార్టీతో తమ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని సీపీఐ(ఎం) తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. దేశంలో కుల గుణన పూర్తి చేయాలని సీపీఎం డిమాండ్ చేస్తుందన్నారు. ఇండియా కూటమి మాత్రమే దేశంలో కుల గణన చేస్తుందన్నారు. బీజేపీ పార్టీ వ్యతిరేక పార్టీ లతో. కలిసి పని చేయడానికి సిద్దంగా ఉన్నాం. తెలంగాణ లో బీఆర్ఎస్ బీజేపీ, మజ్లీస్ పార్టీ లతో సన్నిహితంగా ఉంటుంది.
బీఆర్ఎస్ తో ఎలాంటి సీపీఎం కు సంబంధాలు లేవు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలతో బీఆర్ఎస్ పార్టీకి వణుకు పుడుతుంది. కాంగ్రెస్ మేనిఫెస్టో మా డిమాండ్లకు అనుకూలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ వల్ల రైతు కూలీలకు కూడా తగిన న్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను తలదన్నే పథకాలను ప్రకటించాలి అని సవాల్ విసిరారు తమ్మినేని వీరభద్రం. కాంగ్రెస్ మేనిఫెస్టో మా డిామాండ్లకు అనుకూలంగా ఉందన్నారు.