తిన్న తర్వాత పళ్లలో టూత్‌పిక్స్ పెట్టే అలవాటు ఉందా? ఎంత ప్రమాదమో..

-

కొంతమంది ఏదైనా తిన్నతర్వత టూత్‌పిక్‌ పెట్టి ఓ తిప్పేస్తుంటారు. టూత్‌పిక్‌ లేకపోతే..ఏ పుల్లతోనే, లేకపోతే సెఫ్టీపిన్ తోనే తిప్పుకుంటారు. ఎక్కువగా మటన్, చికెన్ లాంటివి తిన్నప్పుడే వారికే ఇదే పని..మీరు అనుకుంటారు..మరి దంతాల్లో ఇరుక్కుపోయిన వాటిని తీయకపోతే ఎలా, పళ్లు క్లీన్ గా ఉంటాయి, తప్పేం ఏం ఉంది అని..కానీ అలా చేయటం తప్పు. ఫలితంగా.. దంతాలు, చిగుళ్ళను దెబ్బతింటాయి. దీంతో దంతాలు బలహీనపడతాయి. చెక్కతో చేసిన టూత్‌పిక్‌లు చిగుళ్లకు చాలా కష్టం. దీంతో చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది. టూత్‌పిక్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాల గురించి తెలుసుకోండి.

చిగుళ్ల నుంచి రక్తం కారుతోంది..

టూత్‌పిక్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చిగుళ్లకు హాని కలుగుతుంది. దీంతో చిగుళ్ల నుంచి రక్తం కారడంతోపాటు తినడానికి, తాగడానికి ఇబ్బందిగా మారుతుంది.

దంతాల మధ్య ఖాళీ..

టూత్‌పిక్‌ని పదే పదే ఉపయోగించడం వల్ల దంతాలలో ఖాళీలు ఏర్పడతాయి. తద్వారా ఎక్కువ ఆహారం ఖాళీ స్థలంలో నిలిచిపోతుంది. దీని వల్ల దంతాలలో కావిటీస్ ఏర్పడి దంతాలు పుచ్చిపోతాయి.

దంతాలు బలహీనమవుతాయి..

చాలా సార్లు మనం టూత్‌పిక్‌ని ఉపయోగించినప్పుడు దానిని నమలడం ప్రారంభిస్తాము. దీంతో దంతాల మీద ఉండే ఎనామిల్ పొర దెబ్బతింటుంది. ఈ పొర అరిగిపోవడం ప్రారంభమవుతుంది. దంతాలు బలహీనపడటం ప్రారంభమవుతుంది.

టూత్‌పిక్‌ని ఉపయోగించకుండా ఎలా..?

టూత్‌పిక్‌ ను ఉపయోగించకుండా..కర్ర లేదా ప్లాస్టిక్‌కు బదులుగా వేప కర్రను ఉపయోగించవచ్చు. దంతాలకు ఇది నష్టం కాదు. అలాగే, నోటిని సాధారణ లేదా గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవచ్చు. ఇది నోటి దుర్వాసనను నివారిస్తుంది. మౌత్ వాష్‌తో కూడా నోటిని కూడా శుభ్రం చేసుకోవచ్చు. కాబట్టి ఇరుక్కుపోయిన ఆహారం సులభంగా బయటకు వస్తుంది. రాత్రి భోజనం తర్వాత పళ్ళు తోముకోవడం కూడా చాలా ముఖ్యం.

టూత్‌పిక్‌ వాడటం వల్ల దంతాల మధ్య గ్యాప్ ఏర్పడితే చూడ్డానికి అసలు బాగుండదు. అది మీ అందాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఈ అలవాటు మీకు ఉంటే..వెంటనే మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version