టాలీవుడ్ డ్రగ్స్ కేసు : సీఎస్ సోమేష్, ఎక్సైజ్ శాఖకు తెలంగాణ హైకోర్టు నోటీసులు

-

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్టు చోటు చేసుకుంది. ఈ కేసులో దాఖలు అయిన ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ పై తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా తెలంగాణ హై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కు.. ఈ కేసులో భాగంగా హై కోర్టు నోటీసులు జారీ చేసింది.

కోర్టు ధిక్కరణ ఆరోపణలపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాల్ డేటా, డిజిటల్ రికార్డులు ఇవ్వడం లేదని ఈడీ ఆరోపణలు చేయగా.. తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని కోర్టు కు తెలిపింది.

సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కు కోర్టు ధిక్కరణ శిక్ష విధించాలని హై కోర్టుకు విన్నవించింది ఈడీ. ఇక ఈ ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ పై విచారణ ఈనెల 25కి వాయిదా వేసింది తెలంగాణ హై కోర్టు. కాగా.. ఈ కేసులో టాలీవుడ్‌ ప్రముఖులను ఈడీ మరోసారి విచారణ చేయనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version