కేటీఆర్ ను కలిసి సారీ చెప్పాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. తాజాగా ఓ మీడియాలో ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడారు. అప్పుడు అసెంబ్లీలో ఆవేశంలో నోరు జారాను.. దానికి కేటీఆర్ గారిని వ్యక్తిగతంగా కలిసి సారీ చెప్పానన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్.
అటు ఫార్ములా- ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఝలక్ ఇచ్చాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఫార్ములా-ఈ రావడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. అప్పట్లోనే ఫార్ములా- 1 తీసుకు రావాలని చంద్రబాబు నాయుడు అప్పట్లోనే గచ్చిబౌలిలో భూసేకరణ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల రాలేదు ఫార్ములా-ఈ రావడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అనేది మాత్రం నిజం అని తెలిపారు.
అప్పుడు అసెంబ్లీలో ఆవేశంలో నోరు జారాను.. దానికి కేటీఆర్ గారిని వ్యక్తిగతంగా కలిసి సారీ చెప్పాను – కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్
Video Credits- Satyagrahi https://t.co/MxXhq9w9Ha pic.twitter.com/863d39N4fn
— Telugu Scribe (@TeluguScribe) January 9, 2025