ఇదేం రీల్స్ పిచ్చి రా నాయనా…!

-

రీల్స్‌ పిచ్చితో ప్రాణాలను ప్రమాదంలో యువత పెడుతోంది. ఖాళీ సమయం దొరికితే చాలు…రీల్స్‌ చేస్తున్నారు. పరిస్థితులతో సంబంధం లేకుండా…రీల్స్‌ చేసి…ఇబ్బందులు పడుతున్నారు. అయితే… తాజాగా పూణే లోని జంబుల్‌వాడి స్వామినారాయణ మందిర్ సమీపంలోని ఒక పాడుబడిన భవనంపై ఇలా ప్రాణాలను ప్రమాదంలో నెట్టి స్టంట్స్ చేస్తున్నారు యువత.

Dangerous Stunt Goes Viral as Boy Hangs Girl From Abandoned Building to Shoot Reel and Test Grip Strength

జంబుల్‌వాడి స్వామినారాయణ మందిర్ సమీపంలోని ఒక పాడుబడిన భవనంపై కొంత మంది యువకులు ఇలా ప్రాణాలను ప్రమాదంలో నెట్టి స్టంట్స్ చేశారు. సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా క్రేజ్ సంపాదించుకునేందుకు ఈ ఫీట్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్‌ సీరియస్‌ అవుతున్నారు.

ఇదే సమయంలో… రీల్స్ పిచ్చితో ఉసురు తీసుకున్నాడు ఓరుగల్లు యువకుడు. వరంగల్ జల్లాకు చెందిన కందగట్ల అజయ్(23)కి రీల్స్ మోజు. అలా తరచూ రీల్స్ చేస్తూ అప్‌లోడ్ చేస్తుండే వాడు. నర్సంపేటలోని తన చిన్నక్క ఇంట్లో ఉరేసుకుంటున్నట్లు రీల్స్ చేసే క్రమంలో తాడు మెడకు బిగుసుకుపోయి ప్రాణాలొదిలాడు. ఫ్రిడ్జ్ మీద సెల్‌ఫోన్ పెట్టి దూలానికి ఉరి వేసుకుంటున్నట్లు రీల్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు ఇలా జరిగింది. అజయ్ మృతి పై అనుమానం ఉందంటూ తల్లి దేవమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నర్సంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

https://x.com/TeluguScribe/status/1803654548268958160

Read more RELATED
Recommended to you

Latest news