సోనియాకు అద్దంకి దయాకర్ లేఖ…కాంగ్రెస్‌కు రాజీనామానే ?

-

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియా గాంధీకి అద్దంకి దయాకర్ లేఖ రాశారు. అమరవీరుల కుటుంబాలను ఉద్యమ కారులను హక్కును చేర్చుకోవాలని.. కాంగ్రెస్‌ పార్టీని నమ్ముకొని వున్న నేతలను, క్యాడర్కు విశ్వసం కల్పించాలని లేఖలో కోరారు. రైతులకు 2లక్షలు రుణమాఫీ ఇస్తామని మీరే చెప్పాలి, ప్రచారం చేయాలని డిమాండ్‌ చేశారు.

బిఆర్ఎస్, బిజెపి రెండు ఒక్కటే.. కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నాయి. పీసీసీ , సీఎల్పీ ని గైడ్ చేయండన్నారు. నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలి, కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టాలని కోరారు. మన పార్టీలో వున్న నేతలు ఇతర పార్టీలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని వెల్లడించారు. గెలిచాక పార్టీని వీడకుండా వుండే నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని.. టికెట్ల కేటాయింపు విషయంలో నమ్మకం వున్న నేతలకే టికెట్ల కేటాయింపు జరగాలని డిమాండ్‌ చేశారు అద్దంకి దయాకర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version