ఓటమి శాశ్వతం కాదు.. కష్టపడితే గెలుపు మనదే : హరీశ్‌రావు

-

ఓటమి శాశ్వతం కాదు. గెలుపునకు నాంది. బీఆర్‌ఎస్‌కు ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. శుక్రవారం భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..ఓడిపోయిన నియోజకవర్గం సభలో పట్టనంతమంది రావడం మన బలానికి చిహ్నం అన్నారు.

ఎన్నికల హామీలను నిలబెట్టుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రచారంలో అబద్ధాలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీపై అధికారంలోకి వచ్చాక ప్రజల్లో అసహనం పెరిగిందన్నారు. రైతుబంధు పడడం లేదని, జెడ్పీ చైర్మన్‌గా బాధ్యతతో సందీప్ రెడ్డి అడిగితే ఆయనను పోలీసులతో బయటికి పంపించారని ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నల్గొండపై ప్రేమ ఉంటే సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడాలని సూచించారు. రైతు బంధు పడడం లేదని ప్రశ్నిస్తే చెప్పుతో కొట్టాలనడం ఏం సంస్కారమని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version