తెలంగాణలో ఆరు జిల్లాల్లో లోటు వర్షపాతం

-

తెలంగాణలోని అనేక జిల్లాల్లో గత నెలలో ఓ మోస్తరు వర్షాలు మాత్రమే కురిశాయి. జూన్‌లో సాధారణ వర్షపాతం 131.4 మి.మీ. కాగా.. సగటున 17 శాతం అధిక వర్షపాతం (153.5 మి.మీ.) నమోదైనప్పటికీ 6 జిల్లాల్లో తీవ్రమైన లోటు నెలకొందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 8 జిల్లాల్లో సాధారణ స్థాయిలోనే వానలు కురిశాయని పేర్కొంది. ఆరు జిల్లాల్లోని 143 మండలాల్లో తీవ్రమైన వర్షాల లోటు ఏర్పడిందని తెలిపింది.

మంచిర్యాల జిల్లాలోని 18 మండలాలు, నిజామాబాద్‌లో 29, రంగారెడ్డిలో 27, సంగారెడ్డిలో 27, కామారెడ్డిలో 23, వికారాబాద్‌ జిల్లాలోని 19 మండలాలు లోటును ఎదుర్కొంటున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఎనిమిది జిల్లాల పరిధిలోని 138 మండలాల్లో సాధారణ స్థాయిలో (సాధారణ వర్షపాతానికి 19 శాతం అటూ ఇటూ) వర్షాలు కురిశాయని పేర్కొన్నారు. 6 జిల్లాల్లోని 147 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం కన్నా 60 శాతం అధికంగా వర్షాలు కురిశాయని.. మిగిలిన 13 జిల్లాల్లోని మండలాల్లో సాధారణం కన్నా 20 నుంచి 59 శాతం వరకు అధిక వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version