తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని చాలా చోట్ల… వడగండ్ల వానలు కూడా పడుతున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు పడుతున్నాయి. చాలా చోట్ల చెట్లు నేలకూలి… రచ్చ రచ్చయింది.

ఇక ఇవాళ కూడా వడగండ్ల వాన పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని… విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వర్షం కొడుతున్న నేపథ్యంలో.. ముందస్తు సెలవు ప్రకటిస్తే బాగుంటుందని చెబుతున్నారు. మరి దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.