హైదరాబాద్ లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతాహవరం నెలకొంది. హైదరాబాద్ లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేసే ఇళ్లకు మార్క్ చేస్తున్న అధికారులపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. పునరావాసం కోసం వివరాల సేకరణకు అధిఅక్రూలు వస్తే అడ్డుకుంటున్నారు.
సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుంటున్నారు మూసీ నివాసిత ప్రజలు.. ఇళ్లకు మార్క్ వేయకుండా అధికారులను వెనక్కి పంపుతున్నారు స్థానికులు. దింతో కొత్తపేట మారుతినగర్‌లో అధికారుల సర్వే నిలిచిపోయింది.
ఇక అటు చైతన్యపురి మూసీ వద్ద కూల్చివేతలు జరుగుతున్న తరుణంలో .. పెట్రోల్ పోసుకున్నాడు ఓ బాధితుడు. మేం ఇంట్లోనే ఉంటాం మా ఇల్లు కూలగొట్టి మమ్మల్ని చంపి మూసీ నదిలో పడేయండి అంటూ ఆందోళన చేస్తున్నారు బాధితులు. రేవంత్ రెడ్డికి చాత కాకపోతే సీఎం పదవి నుండి దిగమనండి..గత ప్రభుత్వం ఉన్నప్పుడే బావుండే రోడ్లు, నీళ్ళు నీళ్ళు అన్ని వేయించారని అంటున్నారు.