చాలామంది ఈ మధ్యకాలంలో బీపీ సమస్యతో బాధపడుతున్నారు. నేచురల్ గా రక్తపోటుని ఎలా తగ్గించుకోవాలి..? ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు ఆహారంలో పెరుగుని తీసుకోవడం వలన రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. విటమిన్స్, మినరల్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. హైపర్ టెన్షన్ తగ్గించడంలో వెల్లుల్లి సహాయం చేస్తుంది. రక్తపోటుని కంట్రోల్ చేయడానికి వెల్లుల్లి బాగా సహాయం చేస్తుంది.
అలాగే బ్రేక్ ఫాస్ట్ లో మీరు ఓట్స్ తీసుకోవడం మంచిది. ఓట్స్ లో కరిగే ఫైబర్ ఉంటుంది. అలాగే హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. పుచ్చకాయ కూడా బీపీని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ఇందులో వాటర్ కంటెంట్, ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. పుచ్చకాయని తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది కూడా. బీట్రూట్స్ తింటే కూడా బీపీ కంట్రోల్ లో ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్, పొటాషియం. విటమిన్ సి ఆరోగ్యంగా ఉంచుతుంది.
అరటిపండ్లలో ఎన్నో విలువైన పోషకాలు ఉంటాయి. కనుక అరటి పండ్లను కూడా తీసుకోవడం మంచిది బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది. విటమిన్స్, మినరల్స్, ఫైబర్, బెర్రీస్ లో అధికంగా ఉంటాయి. బెర్రీస్ ని తీసుకోవడం వలన రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు బెర్రీస్ లో ఎక్కువగా ఉంటాయి. అలాగే పులియపెట్టిన ఆహార పదార్థాలను కూడా తీసుకుంటూ ఉండాలి. ఇలా వీటిని తీసుకోవడం వలన బీపీ కంట్రోల్ లో ఉంటుంది