గురుకులాల విషయంలో డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు..!

-

తెలంగాణలో గురుకులాల పరిస్థితి దారుణంగా ఉందని ప్రతిపక్షనేతలు గత కొద్ది రోజుల నుంచి విమర్శిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇవాళ తెలంగాణలోని కొన్ని గురుకుల పాఠశాలలకు అద్దె చెల్లించడం లేదని తాళాలు వేశారు. దీంతో వెంటనే మంత్రి స్పందించి.. తాళాలు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు.

తాజాగా గురుకుల పాఠశాలల విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై గురుకుల కార్యదర్శి రోజూ ఒక పాఠశాలను పరిశీలించాలని ఆదేశించారు.  రాష్ట్ర సచివాలయంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నాణ్యతతో కూడిన విద్యాబోధన, సౌకర్యాల కల్పన వంటి అంశాలపై ఆ శాఖ కార్యదర్శులతో భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. గురుకుల పాఠశాలల భవనాల అద్దె చెల్లింపునకు నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. అద్దె భవనాల యజమానులతో మాట్లాడి అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గురుకుల కార్యదర్శి క్షేత్ర స్థాయి పరిశీలన వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version