తెలంగాణ రాష్ట్రంలో రూ. 4400 కోట్లతో రైల్వే లైన్ల అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్, బాసర రైల్వే స్టేషన్ల ఆధునికరణకు కేంద్రం నిధులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రం నిధులు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తోనే రైల్వే పనులు నత్త నడకన సాగుతున్నాయని మండిపడ్డారు.
గోవింద్ పేట రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించినట్లు చెప్పారు అరవింద్. జిల్లాలో మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు రూ. 67 కోట్లతో నిర్మిస్తున్నామని అన్నారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై మోడీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు.