జర్నలిస్ట్ దిలీప్ రెడ్డికి దేవులపల్లి రామానుజారావు పురస్కారం

-

డాక్టర్ దేవులపల్లి రామానుజరావు పురస్కరాన్ని 2023 ఏడాదికి ప్రముఖ పాత్రికేయుడు ఆర్. దిలీప్ రెడ్డికి అందజేయాలని తెలంగాణ సారస్వత పరిషత్ నిర్ణయించింది. నాటి ఆంధ్ర సారస్వత పరిషత్ కి, ఏపీ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా, కవిగా, విమర్శకుడిగా, శోభ పత్రిక సంపాదకుడిగా సేవలందించిన దేవులపల్లి రామానుజరావు పేరుతో పురస్కారాన్ని ప్రతి సంవత్సరం పరిషత్ అందజేస్తున్నది. ఈ ఏడాది పురస్కారానికి ఎంపికైన దిలీప్ రెడ్డి మెదక్ జిల్లాకు చెందిన వాడు.

ప్రముఖ తెలుగు దిన పత్రికల్లో సమాచార హక్కు చట్టం కమిషనర్ గా, పర్యావరణ వేత్తగా విశిష్టసేవలు అందించారని పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి చెన్నయ్య తెలిపారు. ఆగస్టు 25 తేదీన ఉదయం 10.30 గంటలకు పరిషత్ లోని డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ కె.వి రమణాచారి చేతుల మీదుగా అందజేస్తామని తెలిపారు. రూ.25వేల నగదు, శాలువా, జ్ఞాపికతో సత్కరిస్తామని వారు పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version